కమల్ హాసన్….’థగ్ లైఫ్’

21
- Advertisement -

ఉలగనాయగన్ కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం 1987లో విడుదలైన వారి కల్ట్ యాక్షన్ డ్రామా ‘నాయకుడు’ తర్వాత మళ్లీ కలిశారు. 36 సంవత్సరాల తర్వాత లెజెండ్స్ ఇద్దరు పాన్ ఇండియా మూవీ ‘థగ్ లైఫ్’ కోసం తిరిగి జతకట్టారు.

ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఈ రోజు సినిమా షూటింగ్ ప్రారంభమైయింది. సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడియోను మేకర్స్ పంచుకున్నారు. ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయంరవి, గౌతం కార్తిక్, జోజు జార్జ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కమల్ హసన్, మణిరత్నం కల్ట్ క్లాసిక్ కాంబోలో వస్తున్న చిత్రం కావడం, అలాగే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘విక్రమ్’ తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘థగ్ లైఫ్’ పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి. కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్‌లు తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.లెజెండరీ కంపోజర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శర్మిష్ట రాయ్ ప్రొడక్షన్ డిజైన్, అన్బరీవ్ స్టంట్స్ అందిస్తున్నారు.

Also Read:పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో `ముఖ్య‌గ‌మ‌నిక‌`

- Advertisement -