డీప్ ఫేక్ వీడియోకు మళ్లీ బలైన కాజోల్

22
- Advertisement -

గతంలో ‘మాజీ బ్యూటీ కాజోల్’ డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరలయ్యిందో తెలిసిందే. డ్రెస్ మార్చుకుంటున్న ఓ మోడల్ వీడియోకు కాజోల్ ముఖాన్ని జత చేసిన ఆ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రష్మిక, కత్రినా కైఫ్, అలాగే అలియా భట్ వంటి తారల డీప్ ఫేక్ వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే, తమ డీప్ ఫేక్ వీడియోస్ గురించి స్పందిస్తూ.. ఇలాంటి వీడియోస్ నమ్మవద్దని అభిమానులకు వారంతా తెలియజేశారు. అసలు సోషల్ మీడియాలో ఏఐ ఫోటోస్, వీడియోస్ ఎంతగా వైరలవుతున్నాయో కొత్తగా చెప్పక్కర్లేదు.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ సాయంతో నెట్టింట ఎన్నో మ్యాజిక్స్ చేస్తున్నారు కుర్రకారు. ఇందులో భాగంగా కొందరు ఆకతాయిలు తప్పుడు వీడియోలు కూడా క్రియేట్ చేస్తున్నారు. తాజాగా, మరోసారి డీప్ ఫేక్ వీడియోకు బలయ్యింది బీటౌన్ మాజీ బ్యూటీ కాజోల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాజోల్ మరో డీప్ ఫేక్ వీడియో వైరలవుతుంది. అందులో, కాజోల్ అర్ధ నగ్నంగా కనిపించడంతో ఈ వీడియో పై ఆమె ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. కాజోల్ లాంటి సీనియర్ నటి పైనే ఎందుకు ఇలాంటి వీడియోలు వస్తున్నాయి అని అజయ్ దేవగణ్ ఫ్యాన్స్ కూడా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీని తప్పుడు కోణంలో ఉపయోగించడం కచ్చితంగా తప్పే. ఇప్పటికే, పలువురు స్టార్ నటీనటుల ముఖాలతో అసభ్యకరమైన వీడియోస్ క్రియేట్ చేసి.. వారిని మానసికంగా ఎంతో బాధ పెట్టారు. గతంలో రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరలయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత అలియా భట్ కూడా అలాంటి వీడియోతోనే బాధ పడింది. అలాగే కాజోల్ కూడా తరుచూ అలాంటి వీడియోల బారిన పడటం బాధాకరమైన విషయం.

Also Read:బాబోయ్.. బాలయ్యతో హాట్ బ్యూటీ

- Advertisement -