- Advertisement -
రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు కమల్ హాసన్. మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేశారు కమల్. అయితే ఒక్క స్ధానాన్ని కూడా గెలవలేదు. ఆ పార్టీ అభ్యర్థులంతా ఓడిపోగా కమల్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
తమిళనాడులో తమ మిత్రపక్షమైన అధికార డీఎంకే కు తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు కమల్. తమ పార్టీ శ్రేణులు డీఎంకే అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తాయని వెల్లడించారు కమల్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం.
లోక్‌సభ ఎన్నికల్లో తాము డీఎంకేకు మద్దతు ప్రకటించినందుకుగాను వచ్చే ఏడాది తమ పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
Also Read:ఎన్డీయేలోకి టీడీపీ..పొత్తు ఖరారు!
- Advertisement -