కమల్‌ హెల్త్ అప్‌డేట్..

139
kamal
- Advertisement -

కరోనా బారీన పడ్డ నటుడు కమల్ హాసన్ ఆరోగ్య పరిస్ధితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌ వైద్యులు. ఆయన బాగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు.

యుఎస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే కోవిడ్ -19 కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అక్కడి నుంచి వచ్చాకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వైద్యుల సలహా మేరకు కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే కమల్‌ను చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కమల్‌ను దగ్గరుండి చూసుకోవడానికి శృతి హాసన్ షూటింగ్ పనులు ముగించుకుని చెన్నైకి చేరుకుంది. కమల్ కోలుకుంటున్నారనే వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.

- Advertisement -