దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు మృతి..

200
ks
- Advertisement -

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శఖుడు కేఎస్ నాగేశ్వరరావు ఫిట్స్‌తో మృతిచెందారు. శుక్రవారం సొంత ఊరు నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా కోదాడ సమీపంలోకి రాగానే నాగేశ్వరరావుకి ఫిట్స్ రాగా స్ధానికులు ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

నాగేశ్వరరావుకి కుమారుడు, కూతురు భార్య ఉన్నారు. ఆయన మరణ వార్త విని టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. 1986 నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్న నాగేశ్వరరావు స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలో కెరీర్ ను ప్రారంభించారు.

రిక్షా రుద్రయ్య సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దివంగత నటుడు శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ‘పోలీస్’ అనే సినిమా చేశారు. రెండు సినిమాలు మంచి హిట్ అవడంతో ఆ తర్వాత వరుసగా శ్రీహరితో ‘శ్రీశైలం’, ‘సాంబయ్య’, లాంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత వైజయంతి, రా, బిచ్చగాడా మజాకా వంటి మరికొన్ని సినిమాలు చేశారు.

- Advertisement -