తమిళ్ హీరో కమల్ హాసన్ నటించి సూపర్ డూపర్ హిట్ సాధించిన సినిమా విశ్వరూపం. అప్పట్లో ఈసినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈసినిమాకు కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా పూజా కుమార్ నటించింది. విశ్వరూపం సినిమా విజయం సాధించడంతో సీక్వేల్ కూడా తీశాడు కమల్. కానీ కొన్ని కారణాల వల్ల ఆసినిమాను విడుదల చేయకుండా ఇన్ని రోజులు ఆపేశారు. కానీ మళ్లి ఇప్పడు ఆసినిమాకు థియేటర్లకు తీసకురావాలని ప్లాన్ చేస్తున్నారు కమల్.తాజాగా ఈసినిమా గురించి కమల్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. త్వరలో విశ్వరూపం 2 సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈచిత్రానికి సంబంధించిన అన్ని చిక్కులు తొలగిపోయాయన్నారు. దేశభక్తికి సంబంధించిన సినిమా కావడంతో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి సిద్దమయ్యారు. ఈసినిమాలో కమల్ స్వాతంత్య సమరయోధుడిగా నటించారు. ఈసందర్భంగా స్వాతంత్య దినోత్సవానికి ముందుగా ఆగస్ట్ 10వ తేదిన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈసినిమా ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు చిత్ర బృందం. మూడు భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగులో ట్రైలర్ ను ఎన్టీఆర్ చేత…తమిళ ట్రైలర్ ను శ్రుతి హాసన్ తో..హిందీ ట్రైలర్ ను అమీర్ ఖాన్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కమల్ సరసన హీరోయిన్ గా పూజా కుమార్ నటించగా..గిబ్రాన్ సంగీతం అందించారు. ఇక కమల్ ఈసినిమాకు దర్శకత్వం వహించారు.