కమల్‌హాసన్,రజినీకాంత్ సినిమాలో విభిన్న పాత్రలతో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.వీరిద్ధరు రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేస్తారా అని ప్రేక్షకులు,తమిళ ప్రజలు ఎదురు చూస్తున్నారు.కాని వీరు ఏనాడు రాజకీయలకు రావడానికి సుముఖతం వ్యక్తం చేయలేదు.రజినీకాంత్ ఆ మద్యలో రాజకీయాల గురించి పట్టించుకున్నట్లు గా కనిపించారు.కానీ కమల్ మాత్రం ఎన్నడూ రాజకీయాల్లోకి రావలని కాని రాజకీయాల గురించి కాని ప్రస్తావించలేదు.రోజులు గడిచేకొద్ది వీరిద్దరి రాజకీయ అరంగేట్రంపై అభిమానులకు పూర్తిగా ఆశలు పోయాయి.అందులోను రజినీ ఆరోగ్యం కూడా సరిగా లేకపోవటంతో ఆయన పూర్తిగా రాజకీయలకు దూరంగా ఉంటున్నాడు.
ఇలాంటి సందర్బంలో కమల్‌హాసన్ విభిన్న వైఖరిని ప్రదర్శించడంతో అభిమానులు, తమిళ ప్రజలు ఆశ్చర్యానికి గురౌతున్నారు.కమల్ ఈ మద్య ఒక సందర్బంలో మాట్లాడుతు నాకు కోపం ఎక్కువ నేను రాజకీయాలకు పనికి రాను అని ప్రకటించాడట.కాని గత కొద్ది నెలలుగా తన తీరు చూస్తుంటే రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేస్తున్నారేమో అని సందేహ పడుతున్నారు ప్రేక్షకులు.
రాజకీయాలకు దూరంగా ఉండే కమల్‌హాసన్ గత కొద్ది కాలంగా తమిళ రాజకీయ పరిణామాలపై నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కమల్ తాజా రాజకీయ పరిణామాలపై ప్రతి రోజూ స్పందిస్తున్నాడు.తమిళ ప్రజల్ని మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు.తన అభిమానుల్ని ఉత్సాహపరుస్తున్నారు.తన సినిమాల గురించి కూడా ఆలోచించకుండా సినిమా పక్కన్నబెట్టి మరీ ప్రజల కోసం పాటు పడుతున్నాడు.మరి ఇదంత కమల్ రాజకీయాలకు రావడానికి రంగం సిద్ధం చేసుకోవడానికి అంటున్నారు. తన అభిమానులు ఒక్కత్రాటిపై తీసుకురావడానికి ఎన్నాడు లేని విధంగా కేవలం ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి మాట్లాతున్నాడు. తాజాగా తమిళ రాజకీయాల్లో శూన్యత నెలకొంది ప్రజాకర్షణ ఉన్న సిని నటుడు వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావడం కాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి సందర్బంలోనే త్వరలో కమల్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని తమిళ ప్రజలు భావిస్తున్నారు.