తెలుగు సినిమాకు మూలకారకుడైన మా తాతగారు నందమూరి తారకరామారావుగారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నా అని చెప్పారు నందమూరి కళ్యాణ్ రామ్.
వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన కళ్యాణ్ రామ్….. ఒక మంచి జానపద, రాజుల కాలం నాటి సినిమాను మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. అలాంటి ప్రయత్నమే ఈ బింబిసార. ఈసారి మాత్రం ఎవరినీ డిసప్పాయింట్ చేయన అన్నారు. 200 శాతం మీరందరూ సంతృప్తి చెందుతారు, గర్వంగా ఫీలవుతారు అన్నారు.
సినిమాలో పని చేసిన నటీనటులకు, సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సినిమాకు మాటలు రాసిన వాసుదేవ్ మా పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వచ్చాడు. తర్వాత ఈ సినిమాకి డైలాగ్ రైటర్ అయ్యాడని చెప్పారు.