వీక్ కలెక్షన్స్ తో ‘అమిగోస్’

23
kalyanram
- Advertisement -

గతేడాది ‘బింబిసార’ తో ఘనవిజయం సాధించిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ తో ఆ విజయాన్ని అందుకోలేకపోయారు. పోయిన వారం కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ‘అమిగోస్’ చిత్రం విడుదలైంది.

మంచి పబ్లిసిటీ ఉన్నప్పటికీ, సినిమా మీద ఆశించిన హైప్‌ క్రియేట్ అవ్వలేదు. పైగా ‘అమిగోస్’ డల్ యాక్షన్ డ్రామా అనే టాక్ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్స్ పై టాక్ ప్రభావం గట్టిగా పడింది. ఈ సినిమాకి మినిమం ఓపెనింగ్స్ రాకపోవడం ట్రేడ్ ను కూడా ఆశ్చర్య పరుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా మొదటి వారాంతంలో 5 కోట్ల రూపాయల లోపు వసూళ్లు రాబట్టింది.

యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు $150k (రూ.1.2 కోట్లు) వసూలు చేసింది. దీంతో నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘అమిగోస్’భారీ ఫ్లాప్ అనిపించుకుంటుంది.

మరోవైపు ‘రచయిత పద్మభూషణ్’, ‘వాల్టెయిర్ వీరయ్య’ వంటి బాగా ఆడుతుండటం కూడా ee సినిమా పై ఎఫెక్ట్ చూపించాయి. షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ ఇప్పటికీ హైదరాబాద్‌లో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఆ సినిమా ఎఫెక్ట్ కూడా అమిగోస్ కలెక్షన్ పై ప్రభావం చూపిస్తుంది. ఏదేమైనా బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ ఓ ఫ్లాప్ చూడాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -