మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం….

123

సురేందర్ రెడ్డికి దర్శకుడిగా అవకాశమిచ్చింది నందమూరి కళ్యాణ్ రామ్. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం అతనొక్కడే. అతనొక్కడే సినిమాతో సూపర్ హిట్‌ అందుకున్న సురేందర్‌ రెడ్డి దెబ్బకు స్టార్‌ డైరెక్టర్‌ అయ్యిపోయాడు.

దీని తర్వాత కళ్యాణ్ రామ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి తీసిన ‘కిక్-2’డిజాస్టర్ అయింది. ఐతే ఆ సినిమాకు సురేందర్ అనవసరంగా బడ్జెట్ పెంచేశాడని.. షూటింగ్ సందర్భంగా కళ్యాణ్ రామ్ కు.. అతడికి తీవ్ర విభేదాలు తలెత్తాయని అప్పట్లో రకరకాల ప్రచారాలు జరిగాయి.

Kalyan Ram vs Surender Reddy

అయితే దీని గురించి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్‌ సురేందర్ రెడ్డి. ‘కళ్యాణ్ రామ్‌తో నాకు ఎలాంటి విభేదాల్లేవు. మా గురించి జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమే. హిట్లు ఫ్లాపులు అన్నవి సినిమాలో సహజం. వాటి వల్ల రిలేషన్స్ దెబ్బ తినవు. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ముందులాగే ఉంటున్నాం’అనవసరంగా కొంతమంది కావాలనే మమల్ని వార్తలోకి లాగుతున్నారని సురేందర్ మండిపడ్డాడు. కిక్-2 ఫ్లాపవడానికి రకరకాల కారణాలున్నాయని సురేందర్ అభిప్రాయపడ్డాడు.

Kalyan Ram vs Surender Reddy

ఒక హిట్ తర్వాత ఒక ఫ్లాప్ అన్నట్లు తన కెరీర్ సాగిపోతుండటంపై సురేందర్ స్పందిస్తూ.. నేను ఎప్పుడూ ఒకే జానర్లో సినిమాలు తీయలేదు. ఒక సినిమాకు ఇంకో సినిమాకు సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నా. ఒకే తరహాలో కంఫర్ట్ జోన్లో సినిమాలు తీసుకుంటూ పోతే హిట్లే వస్తాయేమో. కానీ సినిమా సినిమాకు కొత్తగా ప్రయత్నం చేస్తున్నా. అందుకే నాకు ఫ్లాపులు కూడా వస్తున్నాయి. అయినా ఇదే దారిలో ప్రయాణం చేస్తా’సురేందర్ రెడ్డి స్పష్టం చేశాడు.