కళ్యాణ్‌కు త్రిష.. సాయిధరమ్‌కు రెజీనా !

301
Nandamuri Kalyan Ram,Sai Dharam Tej ,multi-starrer,A.S. Ravi Kumar Chowdhary,
- Advertisement -

‘పూరి జగన్నాథ్’ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ‘కళ్యాణ్ రామ్’ నిర్మాణంలో ‘ఇజం’ చిత్రం నిర్మితమౌతోంది. ఇటీవలే ఈ సినిమా ఆడియో కూడా లాంచ్ అయింది. ప‌టాస్ త‌ర్వాత ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చిన క‌ళ్యాణ్‌రామ్ న‌టిస్తున్న ఇజం సినిమాపై క‌ళ్యాణ్‌రామ్ కేరీర్‌లోనే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇజం ఆడియోలో కళ్యాణ్ రామ్ మంచి కాన్ఫిడెన్స్ తోనే ఉన్నట్టు కనిపించాడు. పూరీ జగన్నాధ్‌ చేస్తున్న సినిమా హిట్టు కొడుతుందన్న ధీమా రావడం.. ఇజం పాటలకు మంచి రెస్పాన్స్‌ రావడంతో.. ఇదే జోష్‌లో మరో సినిమాను కూడా లైన్లోకి తెచ్చాడు కళ్యాణ్ రామ్. అది మల్టీ స్టారర్ మూవీ కావడం.. మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్‌తో కళ్యాణ్ జత కట్టడం విశేషం. తాజాగా కె.ఎస్. రామారావు నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

‘ రామకృష్ణ’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన త్రిష నటించనుండగా, సాయిధరమ్ సరసన రెజీనా హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందట. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇజం చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా, సాయిధరమ్ తేజ్, గోపిచంద్ మలినేని చిత్రీకరిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

- Advertisement -