కొత్త సినిమా మొదలుపెట్టిన ఎంఎల్ఏ !

215
NTR kalyan ram
- Advertisement -

నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ, హీరోగా నటిస్తూ వరుస సినిమాలతో జోరు మీదున్నాడు నందమూరి కళ్యాణ్‌ రామ్. కేరీర్లో 15వ సినిమా మొదలుపెట్టాడు.   హైదరాబాద్‌లోని రామానాయుడు స్టుడియోలో ఈ కార్యక్రమం ఆదివారం ఘనంగా మొదలైంది. 180 ఫేం జయేంద్ర దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తుంది.

పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్న ఈ చిత్రం పలువురి సెలబ్రిటీల సమక్షంలో పూజా కార్య‌క్ర‌మాలు జరుపుకోగా, తొలి షాట్ కి ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో మలయాళీ భామ ‘ఐశ్వర్య లక్ష్మి’ ఇందులో కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జై లవకుశ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్‌ రామ్ హీరోగా ఉపేంద్ర మాదవ్ దర్శకత్వంలో ఎంఎల్ఏ అనే చిత్రం చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ కథానాయాకగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మనందం ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

- Advertisement -