21న కళ్యాణ్‌రామ్ ‘ఇజం’

269
- Advertisement -

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇజం’. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తం గా అక్టోబర్ 21 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. “ఇజం” చిత్రం ఆడియో ని అక్టోబర్ 5 న హైదరాబాద్ లో విడుదల చేసారు . అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ ఆడియో కి ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది.

“ఇజం నా కెరీర్ లో ఒక స్పెషల్ చిత్రం గా నిలుస్తుంది అని నమ్ముతున్నాను. పూర్తి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి సోషల్ ఎలిమెంట్ ని ఈ చిత్రం లో డైరెక్టర్ పూరి గారు ప్రెసెంట్ చేసారు. ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ వ్యవస్థ, సోషల్ హ్యాకింగ్ గ్రూప్ అనానిమస్ కార్యకలాపాలు లాంటి అంశాలను ఈ చిత్రం టచ్ చేస్తుంది. అక్టోబర్ 21 న విడుదల చేస్తున్నాం” అని నిర్మాత, హీరో అయిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ తెలిపారు.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ‘ఇజం’ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సిక్స్ ప్యాక్ బాడీ తో, టోటల్ న్యూ లుక్ లో కనపడుతోన్న కళ్యాణ్ రామ్ కి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం టీజర్ కి ఒకే ఛానల్ లో సుమారు 16 లక్షల వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2015 టైటిల్ గెలుచుకున్న అదితి ఆర్య ఈ చిత్రం లో హీరోయిన్.

kalyan ram ism

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని హైదరాబాద్ మరియు స్పెయిన్ లో చిత్రీకరించారు. ఉత్తమ సాంకేతిక విలువలతో, హై క్వాలిటీ ఔట్పుట్ తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

- Advertisement -