‘ఇక జనసేన ఊసు నాకు అనవసరం..’ ‘నేను జనసేన అభిమానిగా కూడా కొనసాగదలుచుకోలా’ అంటూ తీవ్ర ఆవేదనకు గురైయ్యారు కల్యాణ్ దిలీప్. జనసేన పార్టీ యాక్టివ్ మెంబర్ గా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నాయకుడిగా చెప్పుకుంటూ పలు టీవీ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలల్లో చాలా చురుకుగా పాల్గొన్నారు కల్యాణ్ దిలీప్.
గత నాలుగేళ్ళుగా దిలీప్ జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారనే చెప్పుకోవచ్చు. అయితే ఉన్నట్టుండి కల్యాణ్ దిలీప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ నుంచి దూరంగా ఉండబోతున్నట్టు తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు దిలీప్.
” మీకంత భారం అనిపిస్తే నేను ఎవ్వరికి బరువు కాదలుచుకోలేదు.. పదే పదే ఆత్మాభిమానాన్ని దెబ్బె కొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. నాకు పార్టీకి సంబంధం లేదనే వ్యాఖ్యలు వినీ వినీ నా చెవ్వులు హోరెత్తిపోయాయి.. మీకు అంత సరదా ఉంది కనుక.. ఒక్కడినే వచ్చా..ఒక్కడిగానే పోరాడా..ఒక్కడిగానే వెళ్లిపోతున్నా.. క్రింద ఉన్న ఎదవల బజారు వ్యాఖ్యలను ఏ రోజు శ్రీ.పవన్ కళ్యాణ్ గారు ఖండిచక పోగా వాళ్ళని కీలక పదవుల్లో కొనసాగించడం ఆయన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు కనుక.. ఇక నేను జనసేన అభిమానిగా కూడా కొనసాగదలుచుకోలా.
పార్టీ ఆఫీస్ వ్యక్తుల చెంచాలు శృతి మించి వ్యాఖ్యానాలు చేస్తే నేను రోడ్ ఎక్కుతా.. ఆల్రెడీ విసిగి విసిగి ఉన్నా కనుక ఎవరి పనులు వారు చేసుకుంటూ అందరికి మంచిది.. ఇక జనసేన ఊసు నాకు అనవాసరం..అలాగే నా ఊసు కూడా ఏ దూల గాడు తియ్యకుండా ఉంటే మంచిది.. నాలుగేళ్లు ఓ పీడకల అనుకుని మర్చిపోతా.. ఉంటా” అని కల్యాణ్ దిలీప్ తీవ్ర ఆవేదనతో తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
మరో పోస్ట్..
” నాకు పార్టీకి సంబంధం లేదని మీడియా చానెల్స్‌కి ఫోన్ చేసి చెప్పే మీడియా హెడ్.. పి.ఆర్.ఓ వేణు. ఇదే ముక్క 48 గంటల్లో ప్రెస్ నోట్ ఇప్పిస్తే.. ఈ జన్మలో జనసేన మొహం కూడా చూడను.. ప్రెస్ నోట్ ఇప్పించి నన్ను ఈ మానసిక వ్యధ నుండి విముక్తుడిని చేస్తే మీకు రుణపడి ఉంటా.. నా బ్రతుకు నేను బ్రతుకుతా..” అని కల్యాణ్ దిలీప్ మరో పోస్ట్ చేశారు.
ఇక ఇదిలా ఉంటే… కల్యాణ్ దిలీప్ అలాంటి వ్యక్తిని జనసేన పార్టీ కోల్పోవడం ఆ పార్టీకి ఆదిలోనే ఎదురుదెబ్బే అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.