బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 82 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో హౌస్ చివరి కెప్టెన్‌గా నిలిచాడు కళ్యాణ్. రీతూతో ఆడితే సులువుగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, తన స్నేహితుడు డీమాన్ పవన్‌కు నిజమైన ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో కళ్యాణ్ అతడినే ఎదుర్కొనే నిర్ణయం తీసుకున్నాడు. ఇది అతని రిస్కీ కానీ ఫెయిర్ డెసిషన్.
కెప్టెన్సీ రేసు ఈసారి హౌస్‌మేట్స్ చేతుల్లో ఉండగా, ప్రతి రౌండ్‌లో డ్యాగర్ సంపాదించినవారు తమకు కెప్టెన్‌గా కావాలనుకున్న వ్యక్తిని ముందుకు తీసుకువచ్చి, ఒకరిని రేసు నుండి బయటకు చేయాల్సి వచ్చింది. ఇందులో సంజన–రీతూ, డీమాన్–ఇమ్యూ, రీతూ–దివ్య మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. డీమాన్ ఇమ్మానుయేల్‌ని రేసు నుంచి తొలగించడం ఇమ్మూని భావోద్వేగానికి గురి చేసింది. అదే సమయంలో రీతూకి వరుసగా వచ్చే సేఫ్టీలు చూసి హౌస్‌లోని చాలామంది ఆమెను తొలగించాలనుకున్నారు.
చివరికి రీతూ, డీమాన్, కళ్యాణ్ ముగ్గురే రేసులో మిగిలారు. డీమాన్ రీతూని కాపాడాలనే పట్టుదల చూపడంతో కళ్యాణ్ తన నిర్ణయం మార్చుకొని రీతూని ఎలిమినేట్ చేశాడు. “నన్ను గెలిచినా గెలువు, డైరెక్ట్ ఫైట్ ఇవ్వాలనుకుంటున్నా” అని డీమాన్‌కు చెప్పి, నిజమైన పోటీని ఎంచుకున్నాడు.
ఫైనల్ టాస్క్ ‘రోడ్ టు కెప్టెన్సీ’లో ఇద్దరూ ఇసుక, కంకరతో తమ రోడ్డును సమానంగా చేయాలి. కళ్యాణ్ వేగంగా ఆడుతుండగా, డీమాన్‌కు తీవ్ర బ్యాక్ పెయిన్ రావడంతో తట్టుకోలేకపోయాడు. రీతూ ఎంత ప్రోత్సహించినా అతడు నిలబడలేకపోయాడు. డీమాన్ పరిస్థితి చూసి కళ్యాణ్ కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. చివరకు టాస్క్ పూర్తి చేసి కెప్టెన్సీని అందుకున్నాడు.
టాస్క్ తర్వాత డీమాన్ కన్నీళ్లు పెట్టుకోవడం, కళ్యాణ్ అతడిని ఓదార్చడం హౌస్ మొత్తం ఎమోషనల్‌గా మార్చింది. చివరికి కెప్టెన్ బ్యాండ్ కట్టించినప్పుడు ఇమ్మూ ఇద్దరినీ “జెమ్స్” అంటూ అభినందించడం హైలైట్‌గా మారింది.
Also read:నియోపోలీస్ భూముల వేలం..రూ.1352 కోట్ల ఆదాయం

