డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు స్పెషల్ విషెస్ తెలిపారు మాజీ ఎంపీ కవిత.కరోనా కట్టడి కోసం డాక్టర్స్ చేస్తున్న కృషి మరువలేనిదని కరోనా పేషంట్ల కోసం వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వారు నిజమైన కరోనా యోధులు అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు కవిత.
ప్రతి సంవత్సరం జూలై 1న డాక్టర్లు దేశానికి చేసే సేవలను గుర్తించడానికి డాక్టర్స్ డే జరుపుకుంటారు. ఈ రోజున రకరకాల ఈవెంట్స్, యాక్టివిటీస్ ని కండక్ట్ చేస్తారు. ఫ్రీ మెడికల్ కాంప్స్ నిర్వహించి ఆరోగ్యం మీద అవగాహనను కలుగచేస్తారు. దేశమంతటా హెల్త్ చెకప్, ప్రివెన్షన్, రోగనిర్ధారణ, చికిత్స వంటి విషయాల మీద చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పేద ప్రజలకూ, వయో వృద్ధులకూ పోషకాహారం గురించిన వివరాలను తెలియచేస్తారు.
స్కూల్స్, కాలేజెస్ లో డాక్టర్స్ చేసే అమూల్యమైన సేవల గురించి యాక్టివిటీస్ కండక్ట్ చేసి వారిలో వైద్య వృత్తి పట్ల ఆసక్తి కలిగేలా చేస్తారు.