ఆకలి కేకలు…సమాచారం ఇవ్వండి: మాజీ ఎంపీ కవిత

461
kalvakuntla kavitha
- Advertisement -

లాక్‌డౌన్ వల్ల చాలామంది ఆకలితో ఉండాల్సి వస్తోంది. పెద్ద ఎత్తున దాతలు తమవంతుగా స్పందిస్తున్న ఇంకా చాలామందికి అన్నం దొరకని పరిస్ధితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆకలితో ఉన్నవారి సమాచారం ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా సూచించారు మాజీ ఎంపీ కవిత.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన ఆమె… జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎవరికైనా ఆహార కొరత ఉంటే 040-21111111 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. తెలంగాణ సీఎంవో ప్రత్యేకంగా మానిటరింగ్ జరుపుతోందని తెలిపిన కవిత…ఎవరు ఆకలితో ఉండకూడదనే ప్రభుత్వ అభిమతమని వెల్లడించారు.

kavitha

- Advertisement -