మాజీ ఎంపీ కవిత ఉదారత…

200
kavitha
- Advertisement -

మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత తన ఉదారతను చాటుకున్నారు.బహ్రయిన్ దేశం నుండి నిజామాబాద్, ఆర్మూరు, జగిత్యాల, కామారెడ్డిలకు చెందిన 153 మంది గల్ఫ్ కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. బహ్రయిన్ దేశంలో ఉన్న వలస కార్మికులను ఇండియా తీసుకొచ్చేందుకు, ఇండియన్ క్లబ్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా నాలుగు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి వారిని స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేశారు.

ఈ విమానంలో తెలంగాణ వాసులు స్వస్థలాలకు వచ్చేందుకు కావాల్సిన అనుమతులు, ఇతర కార్యక్రామాన్నింటినీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, బహ్రయిత్ తెలంగాణ జాగృతి సమన్వయం చేశాయి. బహ్రయిత్ తెలంగాణ జాగృతి అధ్యక్షులు వరికుంట బాబు, నాయకులు ప్రభాకర్, విజయ్ వర్ధన్, శ్రీనివాస్ తదితరులు బహ్రయిన్ లో సమన్వయం చేశారు. జూన్ 27 న, బహ్రయిన్ నుండి గల్ఫ్ ఎయిర్ వేస్ విమానంలో 196 మంది హైదరాబాద్ చేరుకున్నారు. వీరంతా ప్రభుత్వ ఉచిత క్వారంటైన్లో ఉన్నారు.

నేటితో వారం రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలకు చెందిన 153 మంది, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన నాలుగు బస్సుల్లో స్వస్థలాలకు బయలుదేరారు. అంతేకాదు ఈరోజు ఉదయం 153 మందికి తెలంగాణ జాగృతి నాయకులు అల్ఫాహారం ఏర్పాటు చేశారు.

ఆర్మూరు కు చెందిన 43 మంది, కామారెడ్డి జిల్లాకు చెందిన 35 మంది, జగిత్యాల జిల్లాకు చెందిన 31 మంది, నిజామాబాద్ కు చెందిన 44 మంది, మాజీ ఎంపీ కవిత ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో..హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం నుండి స్వస్థలాలకు బయలుదేరారు.

బస్సుల్లో సానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచారు. తెలంగాణ జాగృతి గల్ఫ్ అధ్యక్షులు చెల్లంశెట్టి హరిప్రసాద్, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అడిగిన వెంటనే స్పందించి స్వస్థలాలకు వెళ్లేందుకు సహకరించిన మాజీ ఎంపీ కవిత గారికి గల్ఫ్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -