యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోని తన నివాసంలో రక్తదానం చేశారు మాజీ ఎంపీ కవిత.
అన్ని దానాలకన్నా రక్తదానం గొప్పదని మాజీ ఎంపీ కవిత అన్నారు. రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలు కాపాడుతుందన్న కవిత, తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు సాయం అందించడానికి రక్తదానం చేసినట్లు తెలిపారు. సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే టీఆర్ఎస్ కార్యకర్తలు, వీలైనంత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని మాజీ ఎంపీ కవిత పిలుపునిచ్చారు.
On the call of @trspartyonline working president @KTRTRS garu, donated blood for Thalassemia patients & others in medical emergencies#TRSFormationDay#20YearsOfTRS pic.twitter.com/xgZB37QrZe
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 1, 2020