Kalki 2898 AD:టికెట్ ధ‌ర‌ల పెంపు

4
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ పాన్ ఇండియా చిత్రం కల్కి 2898AD.జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో కల్కి చిత్ర యూనిట్‌కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.

స్పెషల్ షోలతో పాటు సినిమా టికెట్ ధరలను పెంచుతూ అనుమతిని ఇచ్చింది ప్రభుత్వం. తెలంగాణలో స్పెషల్‌ షోలు నిర్వహించుకునేందుకు ఈ నెల 27 నుంచి వచ్చేనెల 4 వరకు అనుమతులు ఇవ్వాలని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ రాష్ట్ర హోంశాఖను కోర‌గా.. ఐదు షోలు వేసేందుకు, టికెట్‌ ధర రూ.200 పెంచుకునేందుకూ హోంశాఖ వారికి అనుమతులు ఇచ్చింది. అలాగే రూ.75, రూ.100 టిక్కెట్ల ధరలనూ పెంచుకునేందుకూ అనుమతులు ఇచ్చింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్‌ల‌లో రూ.377 గా.. మల్టీప్లెక్స్‌ల‌లో రూ.495 గా ఉండ‌బోతుంది. ఇక బెనిఫిట్ షో అనంత‌రం రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్‌ల‌లో రూ.265 ఉండ‌గా.. మల్టీప్లెక్స్‌ల‌లో రూ. 413 గా నిర్ణ‌యించారు.

Also Read:విటమిన్ సి..ఎన్ని ప్రయోజనాలో?

- Advertisement -