కల్కి 2898 ఎడి..సాలిడ్ రెస్పాన్స్!

12
- Advertisement -

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’, మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ఫైనల్లీ రిలీజ్ అయ్యింది. ‘కల్కి 2898 AD’ సినిమాటిక్ యూనివర్స్ ని ఎక్స్ ట్రార్డినరీగా పరిచయం చేస్తూ రెండు నిమిషాల యాభై ఒక్క సెకన్ల నిడివి గల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ మైథాలజీ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది.

పవర్-ప్యాక్డ్ డైలాగ్‌లు, అద్భుతమైన బీజీఎం, టాప్ క్లాస్ VFXతో, ‘కల్కి 2898 AD’ ట్రైలర్ ప్రేక్షకులు ఆడ్రినలిన్-ఫ్లూయిడ్ తో కూడిన సినిమాటిక్ జర్నీని హామీ ఇచ్చింది. ప్రతి అంశంలోనూ అద్భుతం అనిపిస్తూ, బెస్ట్ ఇంటర్ నేషనల్ సినిమా ఎక్స్ పీరియన్స్ ని అందిస్తూ, మేకర్స్ ఎక్స్ ట్రార్డినరీ ట్రైలర్‌ను అందించారు.

పాన్ ఇండియా లెవల్లో కల్కి ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని భాషల్లో కల్కి ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావడం పట్ల మేకర్స్ ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read:డిప్యూటీగా పవన్..17 మంది కొత్తవారే

- Advertisement -