Kalki 2898AD:సెన్సార్ రివ్యూ

6
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD.జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, గ్లింప్స్, సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ముంబైలో పూర్తి చేసుకోగా బాలీవుడ్ ఫిదా అయినట్లు తెలుస్తోంది. కల్కి సినిమాలో అదిరిపోయే విజువల్స్ ఉన్నాయని, హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయని, సినిమా అంతా అయ్యాక స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని తెలిపారు.

కల్కి సినిమా 2 గంటల 55 నిమిషాల నిడివి ఉంటుందని, U/A వస్తుందని ముంబై సెన్సార్ ఆఫీస్ సమాచారం. ప్రభాస్ యాక్షన్ తో పాటు కామెడీ కూడా అదరగొట్టాడని, అమితాబ్, కమల్ హాసన్ తో పాటు మిగిలిన వాళ్లంతా కూడా చాలా బాగా నటించారని సెన్సార్ టాక్.

Also Read:Harish:నాణ్యమైన విద్య ఎక్కడా?

- Advertisement -