కల్కి 2 .. నాగ్ అశ్విన్ హింట్!

14
- Advertisement -

ప్రభాస్ మ్యాసీవ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. ప్రపంచవ్యాప్తంగా ₹ 1200 కోట్లకు పైగా, హిందీ బాక్సాఫీస్ వద్ద ₹ 300 కోట్లకు పైగా వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. డిస్టోపియన్ యూనివర్స్ నుంచి వారియర్ గా భైరవ( ప్రభాస్ ) భారతీయ ఇతిహాసం’మహాభారతం’ నుండి అమరుడైన అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రలో విజువల్ వండర్ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది.

ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కల్కి 2 చిత్రం రిలీజ్ కావాలంటే 3-4 గ్రహాలు అనుకూలించాలని గతంలో నాగ్ అశ్విన్ తెలపగా తాజాగా ఈ సినిమా రిలీజ్ కావాలంటే ఏకంగా 7-8 అనుకూలించాలి అని అన్నారు.

ఈ సీక్వెల్ చిత్రం పట్టాలెక్కాలంటే ప్రభాస్..చేతిలో ఉన్న మరో రెండు సినిమాలు పూర్తి కావాలి. ఆ తర్వాతే కల్కి 2 ప్రేక్షకుల ముందుకురానుంది.

Also Read:వీరమల్లుకు టైమిచ్చేశాడు!

- Advertisement -