నెర్రెలు వారిన నేలపై కాళేశ్వరం జలాలతో తడుపుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..కేసీఆర్ కాళేశ్వరం నీళ్లను పైకి మళ్లిస్తున్నారు. అపర భగీరథుడిలా ఈ ప్రాంతంలో శాశ్వతంగా కరువును తరిమేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కాళేశ్వరం నీళ్లు.. కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, మిడ్ మానేరు వరకు నీళ్లు వస్తున్నాయి. మొత్తంగా ఈ ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలంగా ఉందన్నారు. ఒకప్పుడు ఒక ప్రాజెక్టుకు కొబ్బరి కాయ కొడితే.. అది పూర్తయ్యే నమ్మకం లేకుండే. కాలువలు తవ్వుతూనే ఉన్నారు. కానీ నీళ్లు రాలేదు. కేసీఆర్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రాజెక్టులు పూర్తి చేసి, గోదావరి నీళ్లను మీ పాదాల వద్దకు తీసుకొచ్చారని కేటీఆర్ తెలిపారు.
Also Read: నేడు వర్థంతి…భారత తొలి ఆర్థిక మంత్రి చెట్టి
తెలంగాణ రాకముందు 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 9 గంటల కరెంట్ అని నరికి 6 గంటల కరెంట్ ఇచ్చారు. అది కూడా సక్కగా ఇవ్వని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ వస్తే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అవుతుందన్నారు. బంజారాహిల్స్‌లో ఎలాగైతే నీల్లు వస్తున్నాయో.. మా బంజారా తండాల్లో కూడా అలాగే నీళ్లు వస్తున్నాయని చెప్పారు. మా తండాల్లో మా రాజ్యం తీసుకొచ్చారు. హుస్నాబాద్‌లో 11 తండాలను గ్రామపంచాయతీలు చేశారని ఆ ఆడబిడ్డలు చెప్పారని కేటీఆర్ వివరించారు.
Also Read: వచ్చే నెలలో అమరవీరుల స్మారకం చిహ్నం ప్రారంభం: వేముల