సిరిసిల్లకు కాళేశ్వరం నీళ్లు:కేటీఆర్

245
ktr

అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆరు నెలల్లో వేములవాడ,సిరిసిల్ల భూములకు కాళేశ్వరం నీరు తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. బుధవారం మంత్రి పోచారంతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ అగ్రికల్చర్‌ కాలేజీతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ రైతులకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని….రైతు బంధుతో వారంతా సంతోషంలో మునిగితేలుతున్నారని చెప్పారు. రైతులకు 5 లక్షల భీమా ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎంతో మంది ప్రధానులు వచ్చారని, ఎన్నో ప్రభుత్వాలు మారినా..కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ప్రవేశపెట్టిన పథకాలు ఎవరూ తేలేదన్నారు.

KTR Pocharam Srinivas Reddyరైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇచ్చిన ముఖ్యమంత్రుల్లో దేశంలోనే ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచేందుకే సిరిసిల్లలో అగ్రికల్చర్ కాలేజ్ శంకుస్థాపన చేశామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కొత్త విధానాలను ఈ యూనివర్సిటీలో సైంటిస్టులు రూపొందిస్తారని తెలిపారు. అగ్రికల్చర్ కాలేజీతో ఇక్కడి విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయన్నారు.