కంటెన్మెంట్‌ జోన్‌గా కాళేశ్వరం గ్రామం

141
kaleshwaram
- Advertisement -

కాళేశ్వరం గ్రామాన్ని తిరిగి కంటెన్మైంట్‌ జోన్‌గా ప్రకటించారు అధికారులు. కేవలం కాళేశ్వరం గ్రామంలోనే 50కి పైన పాజిటివ్ కేసులు నమోదుకావడంతో కరోనా కట్టడిలో భాగంగా భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య 10.07.2021నుండి కాళేశ్వరం గ్రామాన్ని కంటోన్మెంట్ జోన్ గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

కావున కాళేశ్వరం దేవస్థానం కు వచ్చే భక్తులు గాని, ప్రాజెక్టు సందర్శనకు వచ్చే యాత్రికులు గాని మరియు అస్తికలు కలుపుటకు వచ్చే వారుగాని ఇక్కడి కరోనా తీవ్రత తగ్గి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మీ కార్యక్రమాలను వాయిదా వేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -