Kaleshwaram: కాళేశ్వ‌రం ఎత్తిపోత‌లు ప్రారంభం..

43
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. పెద్ద‌ప‌ల్లి జిల్లా ధ‌ర్మారం మండ‌లం ప‌రిధిలోని నంది మేడారం పంప్‌హౌస్‌లో అధికారులు మోటార్లు ఆన్ చేశారు. నంది మేడారంలో 4, 6వ మోటార్ల‌ను ఆన్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

గాయ‌త్రి పంప్ హౌస్‌కు 6,240 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నారు. గాయ‌త్రి పంప్‌హౌస్ నుంచి మిడ్ మానేరుకు జ‌లాలు త‌ర‌లిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయవడం లేదని ఆరోపించారు. ఆగస్టు 2 వరకు డెడ్‌ లైన్‌ విధించారు. వంద విభాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక చిన్న సంఘటన పట్టుకుని మేడిగడ్డలో జరిగిన దానిని భూతద్దంలో చూపించి మొత్తం ప్రాజెక్టును బద్నాం చేసి, రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూశారని మండిపడ్డారు.

Also Read:ఏపీ బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా విష్ణుకుమార్ రాజు

- Advertisement -