గోదావరి ఉగ్రరూపం…

168
godavari
- Advertisement -

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉదృతరూపం దాల్చింది. కాళేశ్వరం వద్ద 12 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. భక్తులు నదిలోకి స్నానాల కోసం దిగడానికి వీల్లేదని…ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.

తెలంగాణ, మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నారం బరాజ్‌కు 8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 4.28 టీఎంసీలుగా కొనసాగుతోంది.ఇక మేడిగడ్డ బ్యారేజీ వద్ద 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం భద్రాచలం వద్ద 19.9 అడగుల మేర గోదావరి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం నదిలో 1,84,396 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది.

- Advertisement -