కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం:నామా

397
nama
- Advertisement -

పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల ప్ర‌సంగంలో రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్ సైతం భ‌విష్య‌త్ లో నీటి క‌ష్టాల‌ను ప్ర‌స్తావించారని గుర్తుచేశారు టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు. ఈ స‌మ‌స్య‌ను ముందు గానే భావించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ను స‌శ్య‌శ్యామలం చేసే దిశ‌లో కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ ను త్వ‌ర‌గా పూర్తి చేశారని చెప్పారు.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంలో కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ గురించి ప్ర‌స్తావిస్తే బాగుండేదని చెప్పిన నామా తెలంగాణ కూడా భార‌త దేశంలోనే ఉన్న‌విష‌యాన్ని కేంద్రం గుర్తుంచుకోవాలన్నారు.

సముద్రమట్టం నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటిని పైకితీసుకెళ్ళడం మామూలు విషయం కాదనిప్రపంచంలో పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు.

45 లక్షల ఎకరాలకు సాగునీరు,80 శాతం ప్రజలకు తాగునీరు,పరిశ్రమలకు కావలసిన నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుతుందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ళలో పూర్తికావడం చారిత్రాత్మకం..తెలంగాణ అభివృద్ధిని ప్రోత్సాహించాలి కాని అడ్డుకోకూడదని కేంద్రానికి సూచించారు.

మహరాష్ట్ర ఆంధ్ర ముఖ్యమంత్రులతో సఖ్యతతో ఉంటూ సమస్యల పరిష్కారానికి కెసిఆర్ చొరవ చూపుతున్నారని చెప్పారు.మహరాష్ట్ర, ఆంధ్రా ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రావడం సంతోషకరం కాళేశ్వరం ప్రాజెక్టను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రాష్ట్రపతి ప్రసంగం లో చేర్చాల్సిన అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చలేదన్నారు.

- Advertisement -