శ్రీస్ విజువల్స్ పతాకంపై శ్రీధర్ మరియు దుర్గ హీరో హీరోయిన్ గా పోసాని కృష్ణ మురళి, తోటపల్లి మధు , రవి వర్మ, జబర్దస్త్ జీవన్ ముఖ్య తారాగణంతో కిరణ్ దుస్సా దర్శకత్వంలో శ్రీధర్ శ్రీమంతుల నిర్మించిన చిత్రం “కళాకారుడు”. ఈ చిత్రం యొక్క ట్రైలర్‌ను పాత్రికేయుల సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు.
అనంతరం విలేకరుల సమావేశంలో సంగీత దర్శకుడు రఘు రామ్ మాట్లాడుతూ.. కళాకారుడు సినిమాలో నేను పని చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయి, అని చాల చక్కగా కుదిరాయి. నా పాటలకి మంచి మాటలందించిన గేయ రచయితలందరికి నా కృతఙ్ఞతలు. హీరో నిర్మాత అయిన శ్రీధర్ గారికి సినిమా అంటే పిచ్చి. నిర్మాత అయినా కూడా 24 క్రాఫ్ట్స్‌పై మంచి అవగహన ఉంది. ఫ్యూచర్లో ఒక్క మంచి ఫిలిం మేకర్ అవుతాడని నాకు నమ్మకం ఉంది. చికెన్ ముక్క పాట విడుదలైంది దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. త్వరలోనే సినిమా విడుదలవుతుంది అందరికి నచ్చుతుంది ” అని కురుకున్నారు.
నటుడు రవి వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు కుటుంబం లాంటిది. దర్శకుడు కిరణ్ నాకు చాలా కాలం గా తెలుసు, తన దగ్గర మంచి కథలు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ హీరో అయినా శ్రీధర్ నాకు మంచి మిత్రుడుగా దొరికారు. అయనకి సినిమాలు అంటే ప్యాషన్ పిచ్చి, మంచి సినిమాలు నిర్మించాలని తన కోరిక. సినిమా పాటలు, ట్రైలర్ చూసారు, చాలా బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుంది. అతిత్వరలో మీ ముందుకు వస్తున్నాం. శ్రీధర్ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఇలాంటి సినిమా ఆదరించండి ప్లీజ్ అని తెలిపారు.
హీరోయిన్ దుర్గ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి మంచి సినిమాలో నాకు హీరోయిన్ అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కథ మీ అందరికి నచుతుంది. సినిమా తప్పకుండా చుడండి” అని తెలిపారు. దర్శకుడు కిరణ్ దుస్సా మాట్లాడుతూ.. నాకు అవకాశం ఇచ్చిన నా నిర్మాత శ్రీధర్‌కి కృతజ్ఞతలు. పాటలు అందరు బాగున్నాయి అంటున్నారు, సినిమా కూడా మీకు నచ్చుతుంది అని తెలిపారు.
నిర్మాత శ్రీధర్ శ్రీమంతుల మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు రఘు రామ్ మంచి సంగీతం అందించారు, పాటలు ఎవరు విన్న చాలా బాగున్నాయి అని అంటున్నారు. ప్రతి టెక్నీషియన్ సొంత సినిమాగా భావించి పని చేసారు. నా సినిమాలో నటించిన పోసాని కృష్ణ మురళికి, తోటపల్లి మధుకి, రవి వర్మకి అందరికి నా ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది, మీఅందరికి నచ్చుతుంది.సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలోనే సినిమా ని విడుదల చేస్తాం”అని తెలిపారు.