హీరోయిన్ సాయిపల్లవికి కలైమామణి పురస్కారం దక్కింది. ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ పురస్కారాలను ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను, ఏడాదికి 30 మందికి చొప్పున మొత్తం 90 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది ప్రభుత్వం.
2021వ సంవత్సరానికి సాయిపల్లవి, ఎస్.జే సూర్య.. 2023కు సంగీత దర్శకుడు అనిరుధ్‌ను ఎంపిక చేసింది ప్రభుత్వం. ఈ అవార్డులను వచ్చే నెలలో ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు.
‘కలైమామణి’ అవార్డు గ్రహీతలకు 3 సవర్ల బంగారు పతకు, జ్ఞాపిక అందజేస్తారు. అలాగే, ఖారతీయార్, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బాలసరస్వతి స్మారకార్థం ప్రత్యేక అవార్డులను ప్రదానం చేస్తారు.
2021 సంవత్సరానికి.. హీరోయిన్ సాయిపల్లవి ,ఎస్ జే సూర్య ,పూచ్చి మురుగన్ (నాటకం),లింగుస్వామి (సినీ దర్శకుడు),సూపర్ సుబ్బరాయన్ ఎంపికయ్యారు. అలాగే
బీకే కమలేష్ (బుల్లితెర నటుడు),ఎంపి విశ్వనాథన్ (సంగీత, నాటక నటుడు)లకు కలైమామణి అవార్డు దక్కింది.
Also Read:వెంకట్ మృతి..సాహిత్య రంగానికి తీరని లోటు

