- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వరంగల్ లో నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహంలో పాల్గొన్నడానికి వచ్చిన కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లొ పాల్గొన్నారు. కాకతీయుల 22వ వారుసుడైన కమల్ చంద్ర భంజ్ దేవ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, నగర మేయర్ గుండు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడిన కమల్ చంద్ర భంజ్ దేవ్ తమ పూర్వీకులు ప్రకృతికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. అందులో భాగంగానే గొలుసు చెరువులు తవ్వించారు. అడవులను రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఆ ఒరవడి ఇప్పుడు కేసిఆర్ గారి ప్రభుత్వంలో కనిపిస్తుందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు నా మనసుకు చాలా దగ్గరైన పథకాలన్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా దూరదృష్టితో తీసుకున్న కార్యక్రమన్నారు. మనం బావుండటమే కాదు.. ఈ నేలపై మన భవిష్యత్ తరాలు బావుండాలని వారు తలపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇదొక కార్యక్రమంలా కాకుండా భవిష్యత్త్ లో ప్రజల నిత్యకృత్యమవుతుందన్నారు. తెలంగాణ ప్రజలే కాదు.. యావత్ దేశ ప్రజలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలన్నారు.
ఈ సంధర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో కమల్ చంద్ర భంజ్ దేవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీరు చూపించిన చొరవ కోట్లమందికి స్పూర్తిగా నిలుస్తుందన్నారు. తెలంగాణ పట్ల మీకున్న ప్రేమ, అభిమానం అద్భతమని కీర్తించారు.
- Advertisement -