కాజల్‌..చెర్రీకే కాదు చిరుకు చూపించింది.

132

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ నెంబర్ 150వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు..ప్రేక్షకులంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే టీజర్‌ తో తెగ సందడి చేసిన చిరు..తాజాగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ ఓ మాస్‌ అండ్ బాస్ సాంగ్ తో వచ్చాడు. వీడియో రూపంలో కాకుండా ఫోటో షూట్‌ తో ఈ పాటను రిలీజ్ చేశారు. దేవి శ్రీ రాసి స్వరపరిచిన ఈ సాంగ్ దుమ్ములేపుతోంది. ఈసాంగ్ తో పాటు..మరో విషయం కూడా బాగా హైలెట్ అయింది. అదేంటంటే..కాజల్‌ అందాల విందు. ఇందులో కాజల్ అగర్వాల్ ను చూస్తుంటే మాత్రం మైండ్ బ్లాంక్ అవాల్సిందే. గ్లామర్ తోనే కుర్ర కారు మది పోగొట్టేలా  ఎక్స్ పోజ్ చేసిందని చెప్పాలి.

chiru-kajal
కాజల్ ఈ సాంగ్ మీద చాలా స్టైలీస్ లుక్ తో దర్శనమించింది. కనిపించిన ప్రతీ ఫోటోలోను.. ప్రతీ ఫ్రేమ్ లోను తెగ మెరిసిపోయింది కాజల్. అక్కడక్కడా నడుం అందాలు.. నాభి సోకులు కూడా చూపించింది కానీ.. మితిమీరిన ఎక్స్ పోజింగ్ జోలికి ఏ మాత్రం వెళ్లకుండానే.. తన అందాలను ఈ రేంజ్ లో మెరిపించిందంటే.. కాజల్ ధారపోసిన ట్యాలెంట్ మామూలుగా లేదు. మొదట ఖైదీకి హీరోయిన్‌గా కాజల్ అనగానే..కాస్త సందేహ పడ్డారు. చిరుకు కాజల్ సెట్ అవుతుందా లేదా అనుకున్నారు. కానీ ఈ సాంగ్ మీద మాత్రం ఇద్దరి జంట అదిరిపోయింది. చిరు స్టైలీష్ యంగ్‌ లుక్‌..కాజల్‌ మెరుపుసోకు మొత్తానికి సూపర్ అనిపించుకున్నారు. రోమాంటిక్ ఎలిమెంట్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిందనే చెప్పాలి. మగధీర, నాయక్, గోవిందుడు అందరి వాడేలే సినిమాలతో రామ్ చరణ్‌కు అందాలు ఆర్పించిన కాజల్..ఇప్పుడు ఖైదీతో అందాల విందు చేస్తోంది. మొత్తానికి కాజల్‌ తన గ్లామర్ ఘాటు అప్పుడు చరణ్ కు..ఇప్పుడు చిరుకు చూపించింది..

Khaidi No 150 Songs | AMMADU Lets Do KUMMUDU - Full Song With Lyrics | Chiranjeevi, Kajal | DSP