కాజోల్.. ఒకనాటి బాలీవుడ్ టాప్ హీరోయిన్! చాలా కాలం కిందటే పెళ్లి చేసుకొని గృహిణిగా స్థిరపడింది. అయితే భర్త బాలీవుడ్ లోని ప్రముఖ నటుడు కావడంతో ఈమె హిందీ చిత్ర పరిశ్రమతో టచ్ లోనే ఉంది.
తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసిన ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. జులై 31, 1992న కాజోల్ బెఖుడి అనే మూవితో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది కాజోల్.
అయితే అప్పటికి ఇప్పటికి కాజోల్ అందంలో ఏమాత్రం తగ్గలేదు.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైన ఆమె గ్లామర్ ఏమాత్రం వన్నె తగ్గలేదు. కాజోల్ తను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సిల్వర్ జూబ్లిని పూర్తి చేసుకున్న సందర్భంగా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొన్ని అరుదైన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది కాజోల్.
ఈ ఫోటోలను చూస్తుంటే కాజల్ వయసు 40 ఏళ్లు దాటిన, పెళ్లైనా ఆమె అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం అవుతోంది. కాజోల్ కు ఇప్పటికి సినిమాల్లో అవకాకాలు వస్తూనే ఉన్నాయి. ఆమె నటించిన తమిళ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Throwback to 25 years back. So much love for so long. Truly humbled! 🙏❤ pic.twitter.com/f4VEIxHOPN
— Kajol (@itsKajolD) July 31, 2017