లక్ష్మీకళ్యాణం సినిమాతో అందాల చందమామ కాజల్ అగర్వాల్ తెలుగులో అడుగు పెట్టింది. తర్వాత కృష్ణవంశీ చందమామ సినిమా కాజల్ జాతకాన్ని మార్చేసింది. హీరోయిన్ కు కావల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉండటంతో దశాబ్ద కాలంగా ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే గత ఏడాది బ్రహ్మోత్సవం,సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్లతో కాజల్ పనిఅయిపోందనుకున్నారు.
కానీ ప్రస్తుతం కాజల్ పట్టిందల్లా బంగారమే అవుతోంది. చిరంజీవితో చేసిన ‘ఖైదీ నంబర్ 150’తో కాజల్ బ్లాక్‌బస్టర్ కొట్టింది. చిరంజీవితో నటించినందుకు గాను ఆమె మార్కెట్ రేట్ కంటే ఎక్కువే పారితోషికాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’,రీసెంట్‌గా మెర్సల్‌తో వరుస హిట్‌లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వెంకీతో ఓ మూవిలో నటించే అవకాశాన్ని కొట్టేసింది.
ఈ క్రమంలో కాజల్ టాలీవుడ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తండ్రీ కొడుకులిద్దరి సరసన కథానాయికగా నటించిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రామ్ చరణ్‌తో మూడు సినిమాల్లో నటించిన కాజల్…మెగాస్టార్‌తో ఖైదీ నంబర్ 150లో జోడికట్టింది.
ఇక రానాతో నేనే రాజు నేనే మంత్రిలో అలరించిన కాజల్…వెంకీతో జోడి కట్టేందుకు సిద్దమైంది. మొత్తంగా మెగా,దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అగ్రహీరోలతో జతకట్టి తిరుగులేదని నిరూపించుకుంది.