కాజల్ అగర్వాల్.. “సత్యభామ”

18
- Advertisement -

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.

గత నవంబర్, డిసెంబర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుందీ సినిమా. “సత్యభామ” సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. 35 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ 90శాతం పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ లో హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసింది కాజల్ అగర్వాల్. ఫైట్ మాస్టర్ సుబ్బు ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించారు. కాజల్ గతంలో ఎప్పుడూ కనిపించని యాక్షన్ మోడ్ లో “సత్యభామ”లో కనిపించబోతోంది. కాజల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో శ్రమించి ఈ యాక్షన్ సీక్వెన్సులు కంప్లీట్ చేసింది. సినిమాలో ఈ పోరాట ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని టీమ్ నమ్ముతోంది. “సత్యభామ” బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.

Also Read:తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

- Advertisement -