మన్మధుడితో కాజల్ రొమాన్స్ !

716
Kajal
- Advertisement -

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నాడు. నాగార్జున నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండటంతో ప్రస్తుతం మంచి కథలను వెతికే పనిలో పడ్డాడు నాగార్జున. చివరగా నాగార్జున నటించిన మన్మధుడు 2 మూవీ బాక్సాఫిస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈమూవీ నాగార్జున సొంత బ్యానర్ లో నిర్మించారు. దీంతో కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా నాగార్జున తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

నూతన దర్శకుడు సల్మాన్ చెప్పిన కథ నచ్చడంతో ఈమూవీ చెయడానికి సిద్దమయ్యాడట నాగార్జున. ఈమూవీలో నాగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడ. ఇక ఈచిత్రంలో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. కొంత మంది సీనియర్ హీరోయిన్ల పేర్లను పరిశీలించిన తర్వాత కాజల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇందుకు కాజల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. గతంలో నాగచైతన్యతో కలిసి దడ సినిమాలో నటించిన కాజల్..ఇప్పుడు నాగార్జునతో నటించనుండటం విశేషంగా చెప్పుకోవచ్చు..

Kajal Romance With Akkineni Nagarjuna

- Advertisement -