లాక్‌డౌన్‌లో కాజల్ ఏంచేస్తుందో తెలుసా…?

346
kajal
- Advertisement -

వయసు పెరిగినా తరగని అందం కాజల్ సొంతం. టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన ఈ బ్యూటీ అడపదడప సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక సినిమా అనే రంగుల ప్రపంచంలో హీరోయిన్లకు అందానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

గ్లామర్‌గా ఉంటేనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు. దశాబ్దకాలంగా తన అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్‌ తాను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటానికి గల కారణాలను వెల్లడించింది.

జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఒత్తిడికి గురి కాలేదని తెలిపింది. ఎలాంటి కష్టాలొచ్చినా ఒత్తిడికి లోనవను. సావధానంగా ఆలోచిస్తాను. ఇప్పుడు కూడా అంతే అని అభిప్రాయపడింది. ఈ లాక్ డౌన్ లో ఆన్ లైన్లో కొత్త కోర్సులు నేర్చుకుంటున్నాను.. ఇష్టమైన బుక్స్ చదువుకుంటున్నాను.. అప్పుడప్పుడు వంట చేస్తున్నాను. ఇలా బిజీగా వుంటే ఒత్తిడి అన్నదే రాదని చెప్పుకొచ్చింది అందాల భామ కాజల్.

- Advertisement -