కాజల్ కు గట్టిదెబ్బే తగిలింది…

237
kajal-agarwal
- Advertisement -

చంద‌మామ కాజ‌ల్‌కు కోర్టు గొడ‌వ‌లో ఊహించ‌ని ఎదురు దెబ్బ త‌గ‌లడం ఫిలింన‌గ‌ర్‌లో చర్చనీయాంశమైంది. గ‌త కొంత‌కాలంగా కాజ‌ల్ ఓ హెయిరాయిల్ కంపెనీపై కోర్టులో పోరాడుతోంది. 2008లో వీవీడీ కొబ్బరినూనె ప్రకటనలో నటించడానికి ఆ సంస్థతో కాజల్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఒక్క ఏడాదిపాటే ప్రసారంచేయాలనే నిబంధనతోనే ఆ ప్రకటనలో నటించానని, కానీ దాన్ని ఆ తర్వాతా ప్రసారంచేశారని ఆరోపిస్తూ ఆమె 2011లో మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. ఆ ప్రకటన ప్రసారాన్ని నిలిపివేయాలని, నిబంధనలు అతిక్రమించి ప్రసారం చేసినందుకు తనకు రూ. 2.50 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా సంస్థను ఆదేశించాలని కోర్టును కోరారు.

దీనిపై తుది విచారణ జరిపిన జడ్జి జస్టిస్ టీ రవీంద్రన్ 60 సంవత్సరాల పాటు ఆ యాడ్ పై హక్కులు ఆ సంస్థకి ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో యాడ్ ని ఏడాది తర్వాత ప్రసారం చేయకూడదని కాజల్ డిమాండ్ చేయడం తప్పు అని అన్నారు. ఇప్పటివరకు ఆ కంపెనీకి అయిన కోర్టు ఖర్చంతా కూడా కాజల్ అండ్ కో పెట్టుకోవాలని కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది.దీంతో కాజల్ కి కోర్టులో చుక్కెదురైంది.

నిజానికి ఈ కేసులో ట్విస్టు ఏంటంటే.. అసలు కాజల్ ఆ యాడ్ చేశాక అమ్మడికి ఒక పెద్ద బ్రాండ్ కోకోనట్ ఆయిల్ యాడ్ వచ్చింది. ఈ కొత్త యాడ్ చేసుకోవాలంటే పాత యాడ్ తాలూకు వారి డీల్ ను క్యాన్సిల్ చేసుకోవాలి. అందుకని తెలివిగా వ్యవహరించి అమ్మడు ఇలా కోర్టుకు ఎక్కింది. కాజల్‌ కు కెరీర్ ప‌రంగా ఓట‌మి అన్న‌దే ఎరుగ‌ని కాజ‌ల్‌కు ఇలా కోర్టు తీర్పు రూపంలో అప‌జ‌యం ఎదురైంద‌ని ఫిలింన‌గ‌ర్ లో ముచ్చ‌ట సాగుతోంది.

- Advertisement -