నువ్వా.. నేనా అంటున్న రాధ.. భ్రమరాంబ

241
Kajal Aggarwal vs Rakul Preet Singh
- Advertisement -

తమ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటే చాలు.. సెలెబ్రిటీలు ఆ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి తెగ ఆరాటపడుతుంటారు. తమ సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ప్రమోషన్లలో బిజీగా ఉంటారు. ఇప్పుడు ఇదే కోవలో టాలీవుడ్ లో ఇద్దరు హాట్ భామలు తమ సినిమాల ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా బిజీగా గడుపుతున్నారు. వారిలో ఒకరు కాజల్‌ అగర్వాల్‌ కాగా మరొకరు రకుల్ ప్రీత్ సింగ్‌. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు నటించిన చిత్రాలు రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా పబ్లిసిటీకి శ్రీకారం చుట్టిన ఈ తారలు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎలాగైనా తమ సినిమాలు తప్పకుండా చిత్ర యూనిట్ కి మంచి విజయాన్ని అందించాలని నిర్విరామంగా సోషల్ మీడియాలో మరియి ఎలక్ట్రానిక్ – ప్రింట్ మీడియా వంటి వాటిని అస్సలు వదలడం లేదు అలాగే ఏ ప్రాంతాలకు వెళ్లినా తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తూ.. సినిమాపై అంచనాలు రేపుతున్నారు. వీరిద్దరూ ప్రమోషన్స్ లో ఒకరినిను మించి ఒకరు పోటీ పడుతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ రెండు సినిమాలపై పాజిటివ్ టాక్ ఉండడంతో సినిమా రిలీజ్ తర్వాత కూడా మరింత గట్టిగా సక్సెస్ ప్రమోషన్స్ ని కూడా నిర్వహించేందుకు ఈ భామలు ఆలోచిస్తున్నారట. ప్రస్తుత రోజుల్లో సినిమా షూటింగ్ అయిపోగానే వేరే సినిమాల షూటింగ్స్ ఉన్నాయి అంటూ వెళ్లిపోయే తారలకంటే నిజంగా ఈ తారలు చాలా గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్. రేపు విడుదలయ్యే జయ జనాకినాయక, నేనే రాజు నేనే మంత్రి సినిమాల్లో ఏ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుందో… ఏ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంటుందో.. ఏ ముద్దుగుమ్మకు మంచి పేరు వస్తుందో చూడాలి.

- Advertisement -