ఒక్క ఛాన్స్‌ ఇస్తే.. అన్ని వదిలేసి వస్తా…

271
Kajal Aggarwal Would leave everything to act in Bahubali - 3
- Advertisement -

టాలీవుడ్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా బాహుబలి ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఇప్పటికీ బాహుబలి కట్టప్పని ఎందుకు చంపేశాడు అని సోషల్‌ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తుంది. కాని దానికి సమాధానం మాత్రం బాహుబలి-2 చూడాల్సిందే. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి ది బిగినింగ్ అంటూ మొదటి భాగమే ఎన్నెన్నో సెన్సేషన్స్ సృష్టిస్తే.. బాహుబలి ది కంక్లూజన్ అంటూ రానున్న రెండో భాగంపై చాలానే అంచనాలు ఉన్నాయి.

Kajal Aggarwal Would leave everything to act in Bahubali - 3
ఇంకా బాహుబలి 2 సినిమాకి సంబంధించి ఒక పాట గానీ – టీజర్ కానీ రాలేదు అప్పుడే కాజల్ నోటివెంట బాహుబలి3 అనే మాట రావడంతో అందరూ షాక్ అయిపోయారు. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి మూడో భాగాన్నే తీస్తున్నాడా ఏంటి అనే అనుమానాలు వచ్చేశాయి. ‘ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ జరుగుతోంది. రాజమౌళి కనుక మూడో భాగం తీస్తానంటే.. అందులో ఛాన్స్ కోసం ఎదురుచూస్తా. బాహుబలిలో నటించనందుకు బాధ పడ్డం లేదు. అయితే.. ఇలాంటి ఛాన్స్ జీవితంలో ఒకసారే వస్తుంది కాబట్టి.. మూడో భాగంలో అవకాశం ఇస్తే మాత్రం మిగిలిన సినిమాలన్నీ వదిలేస్తా’అని తేల్చిచెప్పింది టాలీవుడ్ చందమామ.

Kajal Aggarwal Would leave everything to act in Bahubali - 3

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మగధీరలో నటించిన కాజల్.. యువరాణి పాత్రలో ఏ స్థాయిలో మెప్పించిందో మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు బాహుబలిలో కూడా ఇలాంటి రోల్ ఏదైనా వచ్చిందంటే.. కాజల్ కుమ్మేయడం ఖాయం. అయితే.. బాహుబలి3 తీసే ఛాన్స్ లేదని రాజమౌళి ఇప్పటికే చెప్పాశాడుగా.. కాబట్టిగా నో ఛాన్స్ అంతే. అయితే ఇన్నోసెంట్‌గా కనిపించే కాజల్ పెద్ద స్కెచ్చే వేసిందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Kajal Aggarwal Would leave everything to act in Bahubali - 3

- Advertisement -