హోటల్ బిజినెస్ పై కాజల్ చూపు

28
- Advertisement -

హీరోయిన్ గా ఎంత స్టార్ డమ్ తెచ్చుకున్నా.. హీరోయిన్ గా కెరీర్ మాత్రం చాలా చిన్నది. మరి కెరీర్ మసకబారిన తర్వాత సదరు హీరోయిన్ ఏం చేయాలి? ఈ విషయంలో హీరోయిన్లందరికీ ప్లాన్-బి ఉండాలంటోంది అందాల చందమామ కాజల్ అగర్వాల్. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఇప్పటికే తోటి హీరోయిన్లకు సలహాలు-సూచనలు అందించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హీరోయిన్ల బ్యాకప్ ప్లాన్స్ పై స్పందించింది. హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న టైమ్ లోనే ఇష్టమైన రంగంపై దృష్టి సారించాలని కాజల్ అగర్వాల్ చెబుతుంది.

అది ఏ రంగంమైనా మనసుకు నచ్చినదై ఉండాలంటోంది కాజల్. ఇక తన విషయానికొస్తే.. నటించడం తగ్గించిన తర్వాత హోటల్ బిజినెస్ లో వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కాజల్ అగర్వాల్ వెల్లడించింది. “హోటల్ బిజినెస్ లో నేను స్ట్రాంగ్. కాబట్టి భవిష్యత్తులో బిజినెస్ చేస్తే మాత్రం.. కచ్చితంగా హోటల్ బిజినెస్ చేస్తానేమో అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. కాజల్ అగర్వాల్ సినీ నిర్మాణం పై కూడా మాట్లాడుతూ.. సినీ నిర్మాణం చాలా కష్టం. సక్సెస్ రేట్ చాలా తక్కువ. అందుకే, నేను హోటల్ బిజినెస్ తప్ప, సినిమా నిర్మాణం మాత్రం చేయను’ అని కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది.

కాజల్ అగర్వాల్ ఇంకా మాట్లాడుతూ మా వారు గౌతమ్ కి కొన్ని బిజినెస్ లు ఉన్నాయి. అవసరం అయితే, మా వారి బిజినెస్ లెక్కలు చూసుకోగలను. కచ్చితంగా సినిమా రంగంలోనే ఎంచుకోమని అడిగితే మాత్రం.. యాక్టింగ్ స్కూల్ ను నేను సెలక్ట్ చేసుకుంటాను, మొత్తానికి ఇలా బిజినెస్ రంగంపై తనకు ఉన్న అభిరుచిని పరోక్షంగా వెల్లడించింది కాజల్. అన్నట్టు కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటించడానికి కసరత్తులు చేస్తోంది.

Also Read:Rohith Sharma: చివరి టెస్టుకు రోహిత్ దూరం?

- Advertisement -