కత్తి పట్టిన కాజల్‌..ఎవరి కోసమో తెలుసా?

77
kajal
- Advertisement -

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ నటించిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అవినీతి, అక్రమాలని అరికట్టడంలో ‘భారతీయుడు’ చూపించిన తెగువ అందరి మనసుల్లో బలంగా నాటుకుపోయింది. చాలాకాలం తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వస్తుండగా సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

రెండున్నరేళ్ల విరామం తర్వాత ఆగస్టులో తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్‌లపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రూపొందించిన శంకర్.. ఈ చిత్రం యొక్క తాజా షెడ్యూల్ ఈరోజు తిరుపతిలో ప్రారంభమైంది.

కాజల్ తన పాత్ర కోసం కేరళ ప్రాచీన ఆత్మరక్షణ కళ అయిన.. కళరిపయట్టును ప్రాక్టీస్ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 2023 వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుందని సమాచారం.

- Advertisement -