`క‌ల‌ర్స్‌` స్వాతి పెళ్లి ఫిక్స్‌.. వరుడు ఆయనే

232
colours swathi
- Advertisement -

కలర్స్‌ స్వాతి… బుల్లితెరపై ప్రసారమైన కలర్స్‌ ప్రొగ్రామ్‌తో యాంకర్‌ గా ఇంటింటా పరిచయమై.. ఆ తర్వాత అష్టాచమ్మా సినిమాతో హీరోయిన్‌ గా పరిచయమైన ముద్దుగుమ్మ. వెండితెరపై పలు సినిమాల్లో హీరోయిన్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి గత కొంత కాలంగా తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళ, మళయాలం సినిమాల్లో నటిస్తోంది. గతంలో ఆమెకు పలువురు హీరోలతో లింకులు పెడుతూ ఆమె గురించి వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా స్వాతికి సంబంధించి ఓ వార్త వైరల్‌ అవుతోంది. స్వాతి త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మలేషియా ఎయిర్‌ లైన్స్‌లో పైలెట్‌గా పనిచేస్తున్న వికాస్‌ను స్వాతి ప్రేమించి పెళ్లాడబోతోంది. ఈ నెల 30 వ తేదీన వీరిద్దరి వివాహం కొచిలో, రిసెప్షన్‌ సెప్టెంబర్‌ రెండో తేదీన జరగనుంది. స్వాతి మొత్తానికి పలువురు హీరోలతో ప్రేమలో పడిందని వచ్చిన చెక్‌ పెడుతూ ఇప్పుడు స్వాతి ఓ ఫైలెట్‌ని పెళ్లాడబోతోందని వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

- Advertisement -