తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఘనత కాజల్ సొంతం. కాజల్ కథానాయికగా పరిచయమై పదేళ్ళు పూర్తయ్యాయి. తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కల్యాణం సినిమాతో కాజల్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సరిగ్గా పదేళ్ళ తర్వాత తనను వెండితెరకు పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో మరోమారు నటిస్తోంది కాజల్. రాణా హీరోగా తేజ తెరకెక్కిస్తున్న పోలిటికల్ థ్రిల్లర్ “నేనే రాజు నేనే మంత్రి”. కాజల్ నటిస్తున్న 50వ సినిమా ఇది. ఇవాళ కాజల్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఆమెకు అదిరిపోయే గిఫ్ట్నిచ్చింది.
కాజల్‌కి బర్త్ డే విషెస్ చెబుతు ప్రత్యేక టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్లో కాజల్ కళ్లకు రానా గంతలు కట్టి ఆభరణాలు వేస్తాడు. అనంతరం ఆమె కళ్లకు కట్టిన గంతలు తీసి దీపాలతో వెలిగిపోతున్న భవనంలోకి తీసుకెళతాడు. ‘నా పేరు రాధా జోగేంద్ర. రాధ లేనిదే జోగేంద్ర లేడు’ అని రానా చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది. ఓ డైలాగ్ చెబుతాడు. విషయం తెలిసిందే. ఆమె నటిస్తోన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ఆమెకు 50 వ సినిమా. దీనికి కూడా తేజానే దర్శకత్వం వహిస్తుండడం విశేషం.