టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు. 1985 జూన్ 19న జన్మించిన కాజల్ తన 36వ బర్త్ డే జరుపుకుంటున్నారు. తెలుగు, తమిళ పలు బ్లాక్ బస్టర్ సినిమాలో కాజల్ అగర్వాల్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆచార్య, నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), ఇండియన్ 2, “హే సనామికా, హారర్ మూవీ ఘోస్టీ (తమిళ )చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ”కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాజల్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ ‘ఖైదీ’తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక కాజల్ సోషల్ మీడియాలో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో 18. 7 మిలియన్ ఫాలోవర్స్ తో కాజల్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. తమ అభిమాన తారల పుట్టిన రోజున అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నవిషయం తెలిసిందే. జూన్ 19వ తేదీ కాజల్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న కాజల్‌కు హ్యాపీ బర్త్‌డే చెప్పుదామా మరి. పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాల ముద్దుగుమ్మ కాజల్.