వైరల్‌: కొండచిలువతో కాజల్ ఆటలు

240
kajal
- Advertisement -

బేసిగ్గా అమ్మాయలు సున్నితంగా ఉంటారు. చిన్న పురుగు కనిపిస్తేనే భయంతో పరుగులు తీస్తారు. కానీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం ఇందుకు కాస్త ఢిపరెంట్. ఏకంగా కొండ చిలువను మెడలో వేసుకుని ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. థాయ్‌లాండ్‌లో సినిమా  షూటింగ్ జరుగుతోంది. అయితే షూటింగ్ రిలీఫ్ సమయంలో ఆమె ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకున్నారు. ఆ సమయంలో తీసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కాజల్.

వీడియో తీస్తున్న వ్యక్తి కాజల్‌ నువ్వు పాము స్పర్శను గ్రహించగలుగుతున్నావా? అని అడిగగా… అవును. నాకు దాని కండరాల కదలిక తెలుస్తోంది. బుసలు కొడుతున్న విషయమూ తెలుస్తోంది అని చెప్పారు. ఇదొక గొప్ప అనుభూతి అని షేర్ చేసింది. ఈ వీడియోను దర్శకుడు తేజ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను లక్ష 44వేల మంది వీక్షించారు.

- Advertisement -