చందమామ కాజల్ అగర్వాల్ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త ఇప్పుడు తెగ వినిపిస్తోంది. కాజల్ అగర్వాల్ మళ్లీ గర్భవతి అని కొత్త పుకార్లు పుట్టించారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ కొడుక్కి ‘నీల్ కిచ్లు’ అని పేరు కూడా పెట్టారు. ఐతే, కాజల్ మళ్లీ తల్లి కావాలని నిర్ణయించుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉంది. గతంలో ఒప్పుకున్న ఇండియన్ 2 లాంటి చిత్రాలు మాత్రమే చేస్తుంది. కాకపోతే, హిందీలో పలు చిత్రాలను నిర్మించే ప్లాన్ లో ఉంది.
ఓ పెద్ద డిజిటల్ కంపెనీ ఓనర్ తో కాజల్ అగర్వాల్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆ కంపెనీతో కలిసి చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉంది కాజల్ అగర్వాల్. అయితే, ఆ చిన్న చిత్రాల నిర్మాణ పరంపరను కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ చూసుకుంటాడట. కథల ఎంపిక దగ్గర నుంచి నిర్మాణం వరకు అన్నీ కాజల్ అగర్వాలే చూసుకుంటుందని తెలుస్తోంది. హీరోయిన్ గా ఎంతో పాపులారిటీ సాధించిన కాజల్ అగర్వాల్, మరి నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
ఇప్పటికీ కాజల్ అగర్వాల్ కు సౌత్ లో బోలెడు మంది అభిమానులు ఉన్నారు, అందుకే కాజల్ అగర్వాల్ తన ఫ్యాన్స్ కోసం ప్రత్యేక వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తోంది. మొత్తానికి భర్త గౌతమ్ ఆమెకు పూర్తిగా సహకరిస్తున్నాడు. దాంతో, కాజల్ అగర్వాల్ ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ తల్లి కావాలని నిర్ణయం తీసుకుందట.
ఇవి కూడా చదవండి…