హీరోయిన్ కాజల్ అంటే ఇండస్ట్రీ లో మాములు క్రేజ్ లేదు. ఇండస్ట్రీ లోకి ఆడుగు పెట్టి దాదాపు 10 ఏళ్ళు పూర్తి అవుతున్న ఆమె ఉన్న ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. లక్ష్మి కళ్యాణం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర మూవీ తో ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తర్వాత తన కెరీర్లో వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. టాలీవుడ్లో అగ్రహీరోలందరి సరసన నటించి మంచి హిట్స్ తనఖాతాలో వేసు౦కుంది. ఒక తెలుగు లోనే కాక తమిళ్ హిందీ కన్నడ మరియు మలయాళం భాషలో కూడా నటించి తనకి అంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.
అయితే, తాజాగా కాజల్ వెల్లడించిన అంశాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ల దగ్గర విన్నాను. కోర్కెలు తీరిస్తేనే అవకాశం ఇస్తాం అన్నారట. అలాంటి వికృత చర్యలు ఇంకా జరుగుతుండటం బాధాకరం అంటూ కామెంట్ చేసింది. అయితే తనకు మాత్రం అలాంటి అనుభవం ఎదురుకాలేదని తెలిపింది.
గతంలో హీరోయిన్లను కేవలం గ్లామర్ ఆరబోయడానికి మాత్రమే వాడుకునేవారు. కాని ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయ్. నాకు నేనే ఎన్నో సినిమాల్లో అలా గ్లామర్ వస్తువుగా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం నాకు ఏది కావాలో అదే పిక్ చేసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించావ్.. పెద్దగా ఇబ్బందిగా లేదా అంటే.. చరణ్ తో నాలుగు సినిమాలు చేసే.. పవన్ తో ఒక సినిమా.. ఇప్పుడు చిరంజీవితో కూడా చేశాను.. నాకు హ్యాపీగా ఉంది.. అని చెప్పింది.
ప్రస్తుతం అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉండగా తాజాగా నాలుగో సినిమా సైన్ చేయడానికి రెడీగా ఉందట. గతంలో ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్ధితిపై రాధికా ఆప్టే.. అర్చన వంటి హీరోయిన్లు కామెంట్లు చేయగా తాజాగా కాజల్ వారి సరసన చేరి ఇటువంటి సంచలనగా మారింది.