దశాబ్ధకాలం నుంచి వెండితెర మీద వెలిగిపోతోంది అందాల భామ కాజల్ అగర్వాల్. ఎంతోమంది కొత్త హీరోయిన్లు అరంగేట్రం చేస్తున్నా ఈ చందమామ హవా ఇంకా తగ్గలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటిస్తోంది. ఈ మధ్య పెళ్ళి కబుర్లు చెప్పిన అమ్మడు… మరిన్ని సినిమాల్లో చేయాలని భావిస్తున్నట్లుంది. అందుకే తనలోని గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి ఈమధ్య హాట్ హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటోంది. ఇంతకుముందు ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ కు సెక్సీగా రెడీ అయి వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడు ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ కోసం హాట్ ఫోజులచ్చింది.
ఇవన్నీ చూస్తుంటే ఇప్పట్లో కాజల్ కు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామనే ఆలోచన ఉన్నట్టు లేదేమో అనిపించక మానదు. ఇప్పటికే.. కాజల్ ఎంత వరకు ఈ ప్రేమ చిత్రంలో బికినీలో కనిపించనుందంటూ వార్తలొస్తున్నాయి. అటు చిరు సినిమాలోనూ అందాలు విందు ఉంటుందని హింట్ ఇస్తూనే ఉంది. మరీ,ఇలాగైనా కాజల్ సినిమాలతో బిజీ అవుతుందేమో చూడాలి.